శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకున్నది.. మొదటి రోజే 30 వేల మందికి దర్శనం

శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకున్నది.. మొదటి రోజే 30 వేల మందికి దర్శనం

పతనంతిట్ట:కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. సీజనల్ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది.  శుక్రవారం(నవంబర్ 15) మధ్యాహ్నం 1గంటలకు పంపానుంచి స్వామివారి సన్నిధానం వరకు పాదయాత్రకు అనుతిచ్చారు దేవస్థానం బోర్డు. శుక్రవారం నుంచి ప్రతి రోజు దర్శనం కోసం 30వేల మందికి అనుమతిస్తున్నారు. 

శబరిమల వద్ద గర్భాలయంలోకి శుక్రవారం సాయంత్రం 4గంటలకు ప్రవేశం ఉంటుంది. గతంలో సాధారణ ప్రారంభ సమయం 5 గంటలకంటే ఒక గంట ముందుగా భక్తులకు అనుమతిస్తున్నారు. ఆన్ లైన్ విధానంలో దర్శనానికి బుకింగ్ ఉంటుంది. ఈ సీజన్ లో దర్శన సమయాన్ని 18గంటలకు వరకు పొడిగించారు. 

Also Read :- వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె ఎక్కువ తాగితే ఆరోగ్యానికి చేటు

అయ్యప్ప స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను సజావుగా సురక్షితంగా నిర్వహించేందుకు అధికారుల సూచనలన్నింటినీ పాటించాలని భక్తులను పోలీసు శాఖ కోరింది.