
- ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహిస్తాం
- మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
శంషాబాద్, వెలుగు: ఈ నెల 27న వరంగల్ వరంగల్లో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను అడ్డుకోవడానికి రేవంత్ సర్కార్కుట్రలు పన్నుతోందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 10 లక్షల మందితో వరంగల్ వేదికగా గులాబీ సైనికులు గర్జించడం ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం శంషాబాద్ పార్టీ ఆఫీసులో సన్నాహక సమావేశం నిర్వహించారు.
సబితారెడ్డితోపాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, జిల్లా నేతలు హాజరయ్యారు. సబితారెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు.