చెప్పుల్లేకుండా నడుస్తున్న స్టూడెంట్.. కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా

చెప్పుల్లేకుండా నడుస్తున్న స్టూడెంట్.. కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అప్పుడప్పుడు మంచి మనస్సు చాటుకుంటారు. సమస్యలతో బాధ పడుతున్న వారిని ఆదుకుంటుంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రత్యేక వాహనంలో తరలించడం, కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళుతున్న విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవడం వంటివి చేస్తుంటారు. తాజాగా.. ఓ విద్యార్థి చెప్పులు లేకుండా వెళుతుండడం చూసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కాన్వాయ్ ను ఆపి ఆ విద్యార్థితో మాట్లాడారు. అతను చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో వివిధ కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని వెళుతున్నారు.

ధారూర్ మండల కేంద్రానికి చేరుకుంటుండగా..పాఠశాల నుంచి ఇళ్లకు విద్యార్థులు వెళుతున్నారు. ఓ విద్యార్థి కాళ్లకు చెప్పులు లేకపోవడాన్ని మంత్రి సబితా చూశారు. వెంటనే కాన్వాయ్ ని ఆపి ఆ విద్యార్థితో మాట్లాడారు. ఇంట్లోనే చెప్పులు వదిలేసి వస్తున్నట్లు, రోడ్డుపై బురద ఉండడంతో వేసుకోవడం లేదని చెప్పాడు. చెప్పులకు బురద అంటుతుందని చెప్పడంతో అక్కడున్న వారు నవ్వారు. చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని.. ప్రతి రోజు వేసుకొని వెళ్లాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు డిక్షనరీలు అందించారు.