తెలంగాణలోనూ ఢిల్లీ తరహా విద్యావిధానం: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలోనూ ఢిల్లీ తరహా విద్యావిధానం: సబితా ఇంద్రారెడ్డి
  • సోషల్ ఎమోషనల్ స్కిల్స్ పెంచుతాం: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ఆదేశా లతో తెలంగాణలోనూ ఢిల్లీ తరహా విద్యా విధానాన్ని అమలు చేయ బోతున్నామనిమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్టూడెంట్ల​లో సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలు పెంపొం దించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. సోమవారం తన ఆఫీస్​లో విద్యా శాఖ సెక్రటరీ వాకాటి కరుణతో కలిసి పలు అంశాలపై రివ్యూ నిర్వహించారు. స్టూడెంట్లలో ఆత్మవిశ్వాసం, భావోద్వే గం, సామాజిక నైపుణ్యాలు దెబ్బతిన కుండా వారిలో మనోస్థైర్యం పెంచు తామన్నారు. దీనికోసం జిల్లాకో స్కూల్​ను ఎంపిక చేసి, ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రతి స్కూల్ నుంచి ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇస్తామని వివరించారు. మోడల్ స్కూల్స్​లో ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లను బిజినెస్ ఇన్నోవేషన్స్​కు ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ALSO READ:వందే భారత్​లో మంటలు.. 37 మందికి తప్పిన ప్రమాదం