హైడ్రా కూల్చివేతలపై హాట్ కామెంట్స్ చేశారు మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్ అని సెటైర్ వేశారు. మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్పా హైడ్రాకు ఏం పని లేదంటూ ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కపూర్ టౌన్ షిఫ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు సబిత.
కేసీఆర్ మార్క్ తొలగించడానికే హైడ్రాను వాడుకుంటున్నారని అన్నారు. హైడ్రా దూకుడు సామాన్యులను ఇబ్బంది పెట్టేందుకే అన్నారు. హైడ్రా డ్రామా గుట్టును త్వరలోనే రట్టు చేస్తామన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ మార్కును చెరిపేయలేరని చెప్పారు సబితా.