
ఎండలు భగభగమంటున్నాయి. బయట అడుగుపెడితే మాడు మాడిపోతోంది. వేసవి తాపం కోసం బోలెడన్ని జ్యూస్లు తాగేస్తాం. కానీ ఒంట్లో వేడి మాత్రం తగ్గదు. అందుకు ప్రత్యామ్నాయం ఈ సబ్జా, శరీరంలో వేడిని తగ్గించడంతోపాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. ఈ గింజల్లో అనేక పోషకాలున్నాయి.
ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే... చాలామంది సబ్జా గింజలను నానబెట్టి, వాటిలో చక్కెర వేసుకుని తాగేవాళ్లు. ఇప్పుడు ఆ విషయాన్నే మరిచాం. బజార్లో తక్కువ ధరకే ఇవి దొరుకుతాయి. అనేక అనారోగ్య సమ స్యలను తగ్గించి శరీరానికి మేలు చేస్తాయి. చూసేందుకు చిన్నగా, నలుపు రంగులో ఉంటాయి. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో వీటి వాడకం ఎక్కువ. ఈ గింజల్లో పీచుతో పాటు అనేక పోషకాలున్నాయి.
బరువును తగ్గిస్తాయి : బాబిలీ విత్తనాలు అని పిలిచే ఈ గింజలు బరువును నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు క్రమం తప్పకుండా సబ్జా జ్యూస్ తీసుకోవాలి. బరువు తగ్గించడంతోపాటు రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి. నీళ్లలో సబ్జా గింజలు నానపెడితే 30 రెట్లు పెరిగి ఉబ్బుతాయి. ఈ గింజలు ఆకలి తగ్గించి, బరువును అదుపులోకి తెస్తాయి.
చర్మ సమస్యలకు: చాలామంది చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. సబ్జా చర్మానికి మంచి నిగారింపు ఇస్తుంది. చర్మ సంబంధిత సమస్య లను తగ్గిస్తుంది. తామర, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది.
మలబద్ధకానికి చెక్ : సబ్జా గింజలు కడుపును శుభ్రపరుస్తాయి. ఈ గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల నీళ్లు తాగితే మలబద్ధకం సమస్య ఉండదు. శరీరంలోని వ్య ర్ధాలు బయటికిపోతాయి. దాంతో రక్తం శుద్ధి అవుతుంది.
జీర్ణ సంబంధ సమస్యలు... కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తిని కూడా తగ్గి స్తుంది. సబ్జా గింజల్లో విటమిన్-'కె', ప్రొటీన్, ఐరన్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా సబ్జా తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్-ఏ, కె, బీటాకెరోటిన్, పొటాషియం, రాగి, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ లాంటి పోషకాలు అధికం.
ఒత్తిడి మాయం : ప్రతిఒక్కరి జీవితంలో ఒత్తిడి సర్వసాధా రణం. ఈ సబ్జా గింజలు ఒత్తిడిని దూరం చేస్తాయి. మానసిక, మైగ్రేన్, ఒత్తిడి లక్ష ణాలను దూరం చేస్తుంది. దాంతో ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. సబ్జా గింజలు రక్త శుద్ధికి బాగా పనిచేస్తాయి. వాంతులు, వికారం తగ్గుతాయి. నొప్పి, వాపు లక్షణాలను నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, దగ్గు, శ్వాసకోశ, ఎక్కి ళ్లు. నోటిపూత, చెడు వాసన లాంటి అనారో గ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.
కొన్ని జాగ్రత్తలు : సబ్జా గింజలను పిల్లలు, వృద్ధులకు దూరంగా ఉంచాలి. ఈ గింజలు ఈస్ట్రోజన్ స్థాయిని తగ్గి స్తాయి
ఇంకా ఏమేమి ఉపయోగాలున్నాయంటే..
- ఎండాకాలంలో బెస్ట్ డ్రింక్: ఈ గింజలు శరీరంలో వేడిని తగ్గించి శరీర వ్యవస్థకు విశ్రాంతినిస్తాయి. మలినాలను తొలగిస్తుంది.
- శరీరానికి దెబ్బలు తగిలితే : ఈ గింజలు నూరి, నూనెతో కలిపి రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
- శ్వాస సంబంధిత ఇబ్బందులున్న వాళ్లు గోరువెచ్చని నీళ్లలో అల్లం రసం, తేనె నానబెట్టిన సబ్జి గింజలు కలిపి తీసుకోవాలి.
- శరీరంలో తేమ తగ్గితే త్వరగా అలసిపోతారు.
- నీటిలోనే కాక మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాల్లో ఈ గింజల్ని కలిపి తాగొచ్చు.
- 6 రాత్రి పడుకునే ముందు కొన్ని సబ్జా గింజలు నీళ్లలో కలుపుకొని తాగితే మంచిది.