
బ్యాంకాక్: ఇండియా బాక్సర్లు సచిన్ సివాచ్, సంజీత్ కుమార్... పారిస్ ఒలింపిక్స్ రేస్‌లో మరో అడుగు ముందుకేశారు. పారిస్ ఒలింపిక్ క్వాలిఫికేషన్‌లో భాగంగా గురువారం జరిగిన మెన్స్ 57 కేజీ ప్రిక్వార్టర్స్‌లో సచిన్ 5–0తో బటుహాన్ సిఫ్టిసి (టర్కీ)పై గెలవగా, 92 కేజీ రెండో రౌండ్‌లో సంజీత్ కూడా 5–0తో లూయిస్ సాంచెజ్ (వెనిజులా)ను చిత్తు చేశాడు. 57 కేజీల్లో ముగ్గురు బాక్సర్లు మాత్రమే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. కాబట్టి సచిన్ మరో రెండు విజయాలు సాధిస్తే పారిస్ బెర్త్ దక్కుతుంది. 92 కేజీల్లో సెమీస్ చేరిన నలుగురికి ఒలింపిక్స్ ఆడే చాన్స్ ఉంటుంది. అమిత్ పంగల్ (51 కేజీ) 4–1తో మురిసియో రుయుజ్ (మెక్సికో)పై, విమెన్స్ 57 కేజీల్లో జాస్మిన్ 5–0తో మహాసతి హమజయోవా (అజర్బైజాన్)పై నెగ్గి ముందంజ వేశారు.