హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం ఆయన నివాసంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సచిన్ కు.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఇతర నాయకులు స్వాగతం పలికి సీఎం రేవంత్ రెడ్డిఇంటికి తీసుకెళ్లారు.
సచిన్ కు సీఎం తన ఇంటి వద్ద స్వాగతం పలికి.. ఇద్దరు కలిసి కొద్ది సేపు మాట్లాడుకున్నారు. అనంతరం పైలెట్ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో భగవాన్ శ్రీ దేవ్ నారాయణ ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు.