ముంబైలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫేజ్ 5లో క్రికెట్ గాడ్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అతని కుమారుడు అర్జున్ ఓటు వేశారు. ఎన్నికల సంఘం (EC) 'జాతీయ చిహ్నాలు'గా గుర్తించిన అనేక మంది క్రీడా ప్రముఖులలో సచిన్ కూడా ఉన్నారు. టీమ్ ఇండియా స్టార్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, టెస్ట్ స్పెషలిస్ట్ అజింక్యా రహానే కూడా ఓటు వేశారు. ఓటర్లుగా తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలని పౌరులను కోరారు.
మన దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం...అని సూర్యకుమార్ యాదవ్ తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అజింక్య రహానేతో అతని భార్య ఓటు వేసిన తర్వాత తమ సిరా వేళ్ళను చూపిస్తూ సోషల్ మీడియాలో తమ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. మేము మా డ్యూటీ చేసాము అనే శీర్షికను చేర్చాడు. ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో ఉంటే తప్ప ప్రజలందరూ ఓటు వేసేందుకు ప్రయత్నించాలని గవాస్కర్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
లోక్‌సభ 2024 ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో నిర్వహించబడుతున్నాయి. ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన జూన్ 4న జరుగుతుంది.
We did our duty. Have you? pic.twitter.com/HXgwVufwDf
— Ajinkya Rahane (@ajinkyarahane88) May 20, 2024
"Let's shape the future of our nation...": Suryakumar Yadav votes in 2024 LS elections
— ANI Digital (@ani_digital) May 20, 2024
Read @ANI Story | https://t.co/E8T8uvmxHV#SuryakumarYadav #LokSabhaPolls #cricket #LSPolls #Elections2024 #TeamIndia pic.twitter.com/ss8ZMGvHjS
#WATCH | Former Indian Cricketer Sachin Tendulkar and his son cricketer Arjun Tendulkar cast their votes at a polling station in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/fTuJrKqFqj
— ANI (@ANI) May 20, 2024