క్రికెట్ గాడ్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ముందు పవిత్ర నగరమైన అయోధ్యకు చేరుకున్నారు. ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన మొదటి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. సచిన్ అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నప్పుడు కారు ఎక్కి రామ మందిరం వైపు వెళ్తున్నారు.
సచిన్ తో పాటు భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఈ వేడుకకు హాజరయ్యారు. విరాట్ కోహ్లీ అంతకు ముందే ఈ ఈ వేడుకకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.05- 12.55 గంటల మధ్య రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు.
ఈ చారిత్రక ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 1.00-2.00 గంటల మధ్య మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. గంట పాటు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటలకు అయోధ్యలోని కుబేర్ తిలా ఆలయంలో మోదీ ప్రార్థనలు చేయనున్నారు.
Sachin Tendulkar, Anil Kumble, Mithali Raj and Ravindra Jadeja have reached the Ayodhya for The Ram Mandir Pran Pratishtha! ?#AyodhaRamMandir #Ayodhya pic.twitter.com/5ewpNbs41z
— The Cricket TV (@thecrickettvX) January 22, 2024