- సందడిగా బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం
ముంబై : గతేడాది అత్యుత్తమ ఆటతో అదరగొట్టిన ప్లేయర్లను బీసీసీఐ వార్షిక అవార్డులతో సత్కరించింది. శనివారం జరిగిన పురస్కారాల ప్రదానోత్సవంలో (నమన్) లెజెండ్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ‘కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందుకున్నాడు. ఎల్లప్పుడూ ఆటకు విలువ ఇవ్వడంతో పాటు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని క్రికెటర్లకు మాస్టర్ ఈ సందర్భంగా సూచించాడు. ప్రస్తుత ప్లేయర్లలో చాలా క్రికెట్ మిగిలి ఉందన్న సచిన్ ఆటను ఆస్వాదించాలన్నాడు. ఇక, బీసీసీఐ ఉత్తమ క్రికెటర్లుగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన పాలి ఉమ్రిగర్ (బెస్ట్ క్రికెటర్) అవార్డులు అందుకున్నారు. .
కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అశ్విన్‌ను బీసీసీఐ ప్రత్యేక అవార్డుతో సత్కరించింది.2023–24 సీజన్‌కు గాను వివిధ కేటగిరీల్లో మొత్తం 26 అవార్డులు అందజేసింది. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో అత్యధిక వికెట్లు తీసిన హైదరాబాద్ బౌలర్ తనయ్ త్యాగరాజన్‌కు మాధవ్‌రావు సింధియా అవార్డు లభించింది. ఎలైట్ గ్రూప్‌లో ఈ అవార్డును సాయి కిశోర్ సొంతం చేసుకున్నాడు. ఎలైట్ గ్రూప్‌లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్‌గా ఏపీకి చెందిన రికీ భుయ్ నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇండియా మెన్, విమెన్ ప్లేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ రంజీ మ్యాచ్‌లో పాల్గొన్న కారణంగా కోహ్లీ ఈ వేడుకకు రాలేకపోయాడు.