రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన భారత క్రికెట్ దిగ్గజం

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన భారత క్రికెట్ దిగ్గజం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురువారం( ఫిబ్రవరి 06) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. భార్య అంజలి, కుమార్తె సారా టెండూల్కర్‌తో కలిసి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న భారత మాజీ క్రికెటర్‌కు అక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సచిన్.. దేశ ప్రథమ పౌరురాలికి తాను సంతకం చేసిన టెస్ట్ జెర్సీని బహూకరించారు.

బీసీసీఐ లైప్‪టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

ఇటీవల సచిన్ బీసీసీఐ లైప్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఫిబ్రవ‌రి 1న ముంబైలో జరిగిన నామన్ అవార్డుల ప్రదానోత్సవంలో భారత క్రికెట్‌కు సచిన్ చేసిన కృషికి గానూ బీసీసీఐ మాజీ సెక్రటరీ జై షా అవార్డు అందజేశారు.