ఆజాద్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌లో సచిన్ టెండూల్కర్​కు వాటా

హైదరాబాద్​, వెలుగు:  గ్లోబల్  ఓఈఎంల  కోసం ఇంజినీరింగ్, టెక్నికల్​ సొల్యూషన్స్​ అందించే హైదరాబాద్​ కంపెనీ ఆజాద్​ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్  చిన్న వాటాను తీసుకున్నారు. ఈ కంపెనీ క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్,  ఆయిల్ , గ్యాస్ స్పియర్స్​కు విడిభాగాలను సప్లై చేస్తుంది. సచిన్ పెట్టుబడి పెట్టడం ద్వారా  మేక్ ఇన్ ఇండియా  ఆత్మనిర్భర్ భారత్​కు సహకారం అందిస్తామని ఆజాద్​ ఇంజనీరింగ్ ప్రకటించింది.

"ఆయన ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌గా చేరడం మాకు గొప్ప గౌరవం. అత్యంత సంక్లిష్టమైన ప్రొడక్టులను తయారు చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం" అని ఆజాద్​ ఇంజినీరింగ్  మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ చోప్దార్ అన్నారు. అయితే సచిన్​ ఎంత పెట్టుబడి పెట్టిందీ, ఎంత శాతం వాటా తీసుకున్నదీ కంపెనీ వెల్లడించలేదు. ఈ కంపెనీ బోయింగ్, జీఈ, మిత్సుబిషి, సిమెన్స్ వంటి మార్క్యూ గ్లోబల్ క్లయింట్‌‌‌‌‌‌‌‌లతో కలిసి పనిచేస్తోంది.  హనీవెల్, ఈటన్, జీఈ ఏరోస్పేస్, బేకర్ హ్యూస్, హెచ్​ఏఎల్, గోద్రెజ్, టాటా, మహీంద్రా ఏరోస్పేస్ కంపెనీలు కూడా ఈ సంస్థ క్లయింట్లు.