
శ్రీనగర్: ఇండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. జమ్మూ–కశ్మీర్ పారా క్రికెట్ టీమ్ కెప్టెన్ అమిర్ హుస్సేన్ లోన్‌ను శనివారం కలిశాడు. రెండు చేతులు లేకపోయినా మెడ భాగంతో బ్యాట్‌ను పట్టుకుని క్రికెట్ ఆడుతున్న అతను రియల్ హీరో అంటూ ప్రశంసించాడు. చాలా మందికి స్ఫూర్తి అని కొనియాడాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.