Wimbledon 2024: వింబుల్డన్ 2024.. చప్పట్లతో సచిన్ టెండూల్కర్‌కు స్వాగతం

Wimbledon 2024: వింబుల్డన్ 2024.. చప్పట్లతో సచిన్ టెండూల్కర్‌కు స్వాగతం

ఇంగ్లాండ్ లో ప్రస్తుతం వింబుల్డన్ 2024 జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు గ్రాండ్ స్లామ్స్ లో ప్రతిష్టాత్మకంగా భావించే వింబుల్డన్ మ్యాచ్ కు క్రికెట్ గాడ్, లెజెండరీ సచిన్ టెండూల్కర్ శనివారం (జూలై 6) హాజరయ్యారు. అలెగ్జాండర్ జ్వెరెవ్, కామెరాన్ నోరీ మధ్య జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ ను సచిన్ చూడడానికి వచ్చారు. సెంటర్ కోర్ట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సూట్ వేసుకొని కూలింగ్ గ్లాస్ తో రాయల్ బాక్స్ లో కూర్చున్నారు. 

ఈ మ్యాచ్ సందర్భంగా టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రెజెంటర్ సాధించిన విజయాలను, ఘనతలను తెలియజేసినప్పుడు ప్రేక్షకులు  చప్పట్లతో ఈ దిగ్గజాన్ని స్వాగతించారు. సచిన్ వింబుల్డన్ కు హాజరవ్వడం ఇదే తొలిసారి కాదు. ప్రతి సంవత్సరం వింబుల్డన్ మ్యాచ్ ను చూడడానికి వస్తారు. ఈ మ్యాచ్ లో జ్వరెవ్ వరుస సెట్లలో నోరీపై  గెలిచాడు. మ్యాచ్ ముగిసిన అంతరం టెన్నిన్స్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో కలిసి కాసేపు ముచ్చటించాడు. 

టెండూల్కర్ తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ కు హాజరయ్యారు. మీన్‌విలే, మాంచెస్టర్ సిటీ బాస్ పెప్ గార్డియోలా కూడా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి హాజరయ్యారు. వింబుల్డన్ విషయానికి వస్తే ఈ టోర్నీ తొలి మూడు రౌండ్ మ్యాచ్ లు ముగిసాయి. ఆదివారం (జూలై 7) నుంచి ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.