
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ లో పసికూన అనే ట్యాగ్ నుంచి బయటకు వచ్చింది. గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు సాధిస్తున్న విజయాల్లే ఇందుకు నిదర్శనం. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో దాదాపుగా సెమీస్ కు చేరినంత పని చేసింది. పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక జట్లను ఆడిస్తూ సెమీస్ రేస్ ను ఆసక్తికరంగా మార్చింది. 2024 లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అంచానాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు.. సెమీస్ కు వెళ్లి సంచలనం సృష్టించింది. లీగ్ దశలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి అగ్ర శ్రేణి జట్లను ఓడించి వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీ ఫైనల్ కు చేరుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇంగ్లాండ్ పై గెలిచి తమ దేశ క్రికెట్ చరిత్రలో మరో గొప్ప విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అద్భుత ఆటతో బలమైన ఇంగ్లండ్‌కు షాకిచ్చి ఔరా అనిపించింది. మెగా టోర్నీలో ఇంగ్లిష్ టీమ్‌ను సెమీస్‌కు ముందే ఇంటిదారి పట్టించింది. బుధవారం (ఫిబ్రవరి 28) జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో అఫ్గాన్ 8 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయాన్ని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టును ప్రత్యేకంగా అభినందించారు.
"అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిలకడగా రాణిస్తుంది. వారు రోజు రోజు సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సాధిస్తున్న విజయాలను అలవాటుగా మార్చుకున్నారు. ఇకపై వారి విజయాలు సంచలనాలు అనడానికి లేదు".అని టెండూల్కర్ తన ఎక్స్ లో రాసుకొచ్చారు. జద్రాన్ అద్బుతమైన సెంచరీ.. ఓమర్జాయ్ అద్భుతమైన ఐదు వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్‌కు మరో చిరస్మరణీయ విజయాన్ని అందించారు".అని చెప్పారు.
గత నాలుగైదేళ్లలో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించింది. ఆ జట్టులో ఆరేడుగురు ప్లేయర్లు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతూ మంచి అనుభవాన్ని గడించారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడమే కాదు.. ఒత్తిడిలోనూ రాణించగలిగేలా నైపుణ్యాన్ని గడించారు. రహ్మనుల్లా గుర్భాజ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి మ్యాచ్ విన్నర్లు వారి సొంతం. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఆసియాలో టీమిండియా తర్వాత అతి పెద్ద జట్టు అని కితాబులందుకుంటుంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (146 బాల్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177) రికార్డు సెంచరీకి తోడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (41; 5/ 58) ఆల్‌రౌండ్ షోతో విజృంభించడంతో బుధవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో అఫ్గాన్ 8 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. తొలుత అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 325/7 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో జో రూట్ (111 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 120) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 రన్స్‌కు ఆలౌటైంది.
Afghanistan’s steady and consistent rise in international cricket has been inspiring! You can’t term their wins as upsets anymore, they’ve made this a habit now.
— Sachin Tendulkar (@sachin_rt) February 26, 2025
A superb century by @IZadran18 and wonderful five-for by @AzmatOmarzay, sealed another memorable win for Afghanistan.… pic.twitter.com/J1MVULDtKC