ISPL: టెన్నిస్ బాల్‌‌‌‌కు టేపు వేసి ఆడేవాణ్ణి: సచిన్ టెండూల్కర్

ISPL: టెన్నిస్ బాల్‌‌‌‌కు టేపు వేసి ఆడేవాణ్ణి: సచిన్ టెండూల్కర్

ముంబై: టెన్నిస్ బాల్‌‌‌‌తో ఆడే ఇండియన్‌‌‌‌ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌‌‌‌పీఎల్‌‌‌‌)లో  రివర్స్‌‌‌‌ స్వింగ్‌‌‌‌ను పరిచయం చేసేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ గతంలో తాను ఉపయోగించిన టెక్నిక్‌‌‌‌ను చెప్పాడు. టెన్నిస్ బాల్‌‌‌‌కు ఓ వైపు టేపు అతికించి ఆడాలని సూచించాడు. తాను ఇదే పని చేసి.. ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌లో రివర్స్‌‌‌‌ స్వింగ్‌‌‌‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగానని తెలిపాడు.

ఆరు జట్లు పోటీ పడే  ఐఎస్‌‌‌‌పీఎల్ రెండో ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనుంది. ఆదివారం జరిగిన రెండో సీజన్ లాంచింగ్ ప్రోగ్రామ్‌‌‌‌లో పాల్గొన్న సచిన్‌‌‌‌ టెన్నిస్ బాల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను సరికొత్తగా మార్చే ఐడియా చెప్పాడు. ‘నేను క్రికెట్ ఆడే రోజుల్లో టెన్నిస్ బాల్‌‌‌‌కు ఒకవైపు టేప్‌‌‌‌ వేసేవాడిని. లెదర్ బాల్స్‌‌‌‌తో ఆడేటప్పుడు మనం షైన్‌‌‌‌, రఫ్‌‌‌‌గా ఉన్న సైడ్స్‌‌‌‌ కోసం చూస్తుంటాం.   ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌లో రివర్స్‌‌‌‌ స్వింగ్ ఎదుర్కోవడానికి నేను ఓవైపు టేపు వేసిన  టెన్నిస్‌‌‌‌ బాల్‌‌‌‌తో ప్రాక్టీస్ చేసేవాడిని. దాన్ని ఈ ఫార్మాట్‌‌‌‌లో (ఐఎస్‌‌‌‌పీఎల్‌‌‌‌) ఎందుకు పరిచయం చేయకూడదని అనుకుంటున్నా. అలా చేస్తే బ్యాటర్ల టెక్నిక్‌‌‌‌కు పరీక్ష పెట్టొచ్చు’ అని సచిన్ పేర్కొన్నాడు.