సచిన్‌‌‌‌కు లైఫ్‌‌‌‌ టైమ్ అచీవ్‌‌‌‌మెంట్ అవార్డు

సచిన్‌‌‌‌కు లైఫ్‌‌‌‌ టైమ్ అచీవ్‌‌‌‌మెంట్ అవార్డు
  • బీసీసీఐ ఉత్తమ క్రికెటర్లుగా బుమ్రా, మంధాన

ముంబై : లెజెండరీ క్రికెటర్‌‌‌‌ సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌కు ‘సీకే నాయుడు లైఫ్‌‌‌‌ టైమ్ అచీవ్‌‌‌‌మెంట్’ అవార్డు లభించింది. ఈ మేరకు 2023–-24 ఏడాదికిగాను బీసీసీఐ శుక్రవారం వార్షిక అవార్డులను ప్రకటించింది. 1994లో ప్రవేశపెట్టిన సీకే నాయుడు పురస్కారం అందుకుంటున్న 31వ ప్లేయర్‌‌‌‌ సచిన్‌‌‌‌. గతేడాది సూపర్ పెర్ఫామెన్స్ చేసిన టీమిండియా స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా ఉత్తమ మెన్స్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ (పాలి ఉమ్రిగర్‌‌‌‌) అవార్డుకు ఎంపికయ్యాడు.. విమెన్స్‌‌‌‌లో స్మృతి మంధానకు పాలి ఉమ్రిగర్‌‌‌‌ పురస్కారంతో పాటు ‘వన్డే మెడల్‌‌‌‌’ (అత్యధిక రన్స్‌‌‌‌) కూడా దక్కింది. 

గతేడాదిలో 4 సెంచరీలతో కలిపి 743 రన్స్‌‌‌‌ చేసింది. బౌలింగ్‌‌‌‌లో అత్యధిక వికెట్లు (24) తీసిన దీప్తి శర్మకు ‘వన్డే మెడల్‌‌‌‌’ లభించింది. క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పిన స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌కు బీసీసీఐ స్పెషల్‌‌‌‌ అవార్డుతో సత్కరించనుంది. ముంబై బ్యాటర్‌‌‌‌ సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌కు ‘బెస్ట్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ డెబ్యూ’ అవార్డు లభించగా, విమెన్స్‌‌‌‌లో ఆశా శోభనకు ఇచ్చారు. శనివారం ముంబైలో జరిగే వేడుకలో  బీసీసీఐ ఈ అవార్డులను అందించనుంది.