Sachin Tendulkar: మరోసారి బ్యాట్ పట్టనున్న సచిన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Sachin Tendulkar: మరోసారి బ్యాట్ పట్టనున్న సచిన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?

భారత మాజీ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) మరోసారి బ్యాట్ పట్టనున్నారు. తన మాజీ సహచరుడు యువరాజ్ సింగ్ జట్టుతో అమీ తుమీ తేల్చుకోనున్నారు.

మాస్టర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 1989లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన సచిన్.. 2013లో తన ఆఖరి టెస్ట్ ఆడారు. ముంబై వాంఖడే వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మాస్టర్ 74 పరుగులు చేశారు. 

అలా అని సచిన్ క్రికెట్‌తో తన బంధాన్ని తెంచుకోలేదు. అప్పుడప్పుడు మైదానంలో కనిపిస్తూనే ఉన్నారు. ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ మెంటార్ గా కొనసాగుతూనే ఉన్నారు. అలాగే, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం నిర్వహించే రోడ్ సేఫ్టీ సిరీస్ వంటి ఇతర లీగ్‌లలోనూ కనిపించారు. ఇప్పుడు అలాంటి ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా మాస్టర్ బ్లాస్టర్ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

బెంగళూరులో మ్యాచ్

సామాజిక సేవకు మద్దతుగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ నేతృత్వంలోని జట్లు తలపడనున్నాయి. ఇందులో ఇర్ఫాన్ పఠాన్, ముత్తయ్య మురళీధరన్, మాంటీ పనేసర్, మఖాయ ఎన్తినీ పలువురు అంతర్జాతీయ మాజీలు కనిపించనున్నారు. జనవరి 18న బెంగళూరులోని సాయికృష్ణ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీని ద్వారా విద్య, ఆరోగ్య రంగాలకు సహాయం చేసేందుకు విరాళాలు సేకరించనున్నారు.