
వడోదరా: ఛేజింగ్‌లో టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ (33 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) దంచికొట్టినా.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో ఇండియాకు ఓటమి తప్పలేదు. బుధవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాస్టర్స్ 95 రన్స్ తేడాతో ఇండియా మాస్టర్స్‌పై గెలిచింది. టాస్ ఓడిన ఆసీస్ 20 ఓవర్లలో 269/1 స్కోరు చేసింది. షేన్ వాట్సన్ (52 బాల్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 110 నాటౌట్), బెన్ డంక్ (53 బాల్స్‌లో 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 132 నాటౌట్) సెంచరీలతో విజృంభించారు.
33 రన్స్ వద్ద షాన్ మార్ష్ (22) ఔటైనా.. వాట్సన్, డంక్ రెండో వికెట్‌కు 236 రన్స్ జత చేశారు. పవన్ నేగి ఒక్క వికెట్ తీశాడు. తర్వాత ఇండియా 20 ఓవర్లలో 174 రన్స్‌కు ఆలౌటైంది. సచిన్‌తో పాటు యూసుఫ్ పఠాన్ (25), నమన్ ఓజా (19), రాహుల్ శర్మ (18) రాణించారు. పవన్ నేగి (14), ఇర్ఫాన్ పఠాన్ (11)తో సహా మిగతా వారు నిరాశపర్చారు. జేవియర్ డోహెర్తీ 5 వికెట్లు పడగొట్టాడు.
బంధన్ క్రిసిల్ ఐబీఎక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3-6 నెలల డెట్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్- ఎండెడ్ డెట్ ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ క్రిసిల్ -ఐబీఎక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3-6 నెలల డెట్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఇందులో మూడు నుంచి ఆరు నెలల మధ్య మెచ్యూరిటీ కలిగిన ఆర్థిక సేవల రంగం డెట్ సెక్యూరిటీలు ఉంటాయి. కొత్త ఫండ్ ఆఫర్ గురువారం మొదలయింది. ఇది ఈ నెల 11న ముగుస్తుంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.వెయ్యి ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఫండ్‌ను బ్రిజేష్ షా, హర్షల్ జోషి నిర్వహిస్తున్నారు.
ఫిన్‌టెక్ కంపెనీ ఆక్సిలో ఫిన్‌సర్వ్ 'ఇంపాక్ట్‌ఎక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్'ను ప్రకటించింది. మనదేశంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సమస్యలను తొలగించడం ఈ కార్యక్రమం లక్ష్యం. దీనికింద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. గుర్తింపు పొందిన సంస్థలో పూర్తి-స్థాయి యూజీ/పీజీ చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ అమెజాన్ తన బిజినెస్ కస్టమర్ల కోసం ఆర్థిక సంవత్సరం ముగింపు సేల్‌ను ప్రకటించింది. ఇది ఈ నెల 11 వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు జీఎస్టీ ఇన్ వాయిస్ తో 28 శాతం ఆదా చేయవచ్చని, ఎస్బీఐ కార్డుతో 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. ఈఎంఐల ద్వారా ప్రొడక్టులను కొనొచ్చని అమెజాన్ పేర్కొంది.