ముంబై: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో బరిలోకి దిగే ఇండియా టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గావస్కర్ లీగ్ కమిషనర్‌గా పని చేయనున్నారు. వచ్చే నెల 22 నుంచి మార్చి 16 వరకు ఈ టోర్నీ జరగనుంది. ముంబై, రాజ్‌కోట్, రాయపూర్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
వెస్టిండీస్ జట్టుకు బ్రియాన్ లారా నేతృత్వం వహిస్తాడు. శ్రీలంక కెప్టెన్‌గా కుమార సంగక్కర, సౌతాఫ్రికా సారథిగా ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ వ్యవహరించనున్నారు. ఇయాన్ మోర్గాన్, షేన్ వాట్సన్ వరుసగా ఇంగ్లండ్, ఆసీస్ జట్లను నడిపించనున్నారు.