వేములవాడ రాజన్న సన్నిధికి రాముని పాదుకలు

వేములవాడ, వెలుగు: అయోధ్య రామమం దిరంలో పూజలు అందుకున్న పాదుకలు గురువారం వేములవాడ రాజన్న సన్నిధికి చేరాయి. ఆలయ అధికారులు, అర్చకులకు పాదుకలకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 22న అయోధ్య రామమం దిర ప్రతిష్ఠ రోజునే ఈ పాదుకుల ప్రతిష్ఠాపన జరుగుతుందని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సురేశ్ ఆత్మరామ్ మహారాజ్ రామదాసీ తెలిపారు.