మృతుల్లో ఐదుగురు ఇంజనీర్లు, ఇద్దరు ప్లాంట్ అటెండెంట్లు , ఇద్దరు ప్రైవేటు ఎంప్లాయీస్
యూనిట్ లో గురువారం రాత్రి చెలరేగిన మంటలు
శుక్రవారం సాయంత్రం దాకా రెస్క్యూ ఆపరేషన్
మంటలను ఆర్పుతూ ఊపిరా డక సిబ్బంది విలవిల
టన్నెల్ నుంచి ఎగ్జిట్ దాకా వచ్చి ప్రాణాలు విడిచారు
సొరంగమంతా కమ్ముకున్న పొగ.. రెస్క్యూ కు ఆటంకం
ప్రాణాలతో బయటపడ్డ 15 మంది ఎంప్లాయీస్
ఘటనపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం
ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. జగన్ టూర్ రద్దు
వెలుగులు నింపే బతుకులు చీకట్లో కలిసిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా పాతాళగంగ వద్ద శ్రీశైలం హైడల్ పవర్ ప్లాంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తొమ్మిది నిండు ప్రాణాలను బలితీసుకుంది. ప్లాంట్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ప్రయత్నిం చిన ఇంజనీర్లు, ఉద్యోగులు.. ఊపిరాడక, బయటకు వచ్చే పరిస్థితి లేక అందులోనే తుదిశ్వాస విడిచారు. వీరిలో ఓ డీఈ, నలుగురు ఏఈలు, ఇద్దరు ప్లాంట్ అటెండెంట్లు , ఇద్దరు అమరాన్ బ్యాటరీ స్టాఫ్ ఉన్నారు. మృతులంతా 30 నుం చి 35 ఏండ్ల లోపువాళ్లే. 900 మెగావాట్ల కెపాసిటీ కలిగిన ఈ ప్లాంట్ ఏర్పడినప్పటి నుంచి ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని విద్యుత్ శాఖ చెబుతోంది. అయితే.. పవర్ ప్లాంట్లో సరైన ఫైర్ సెఫ్టీ లేకపోవడం, పది గంటలు ఆలస్యంగా రెస్క్యూ టీమ్ కు సమాచారం ఇవ్వడంతోనే ప్రాణ నష్టం జరిగినట్లు ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పా తాళగంగ(నాగర్ కర్నూల్), వెలుగు: శ్రీశైలం ఎడమ గట్టు హైడల్ పవర్ ప్లాంట్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద టైం లో 24 మంది అక్కడ ఉండగా.. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిం చి.. ఊపిరాడక, బయటకు వచ్చే పరిస్థితి లేక తుదిశ్వాస విడిచారు. 15 మంది బయటకు రాగా.. వారిలో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని విద్యుత్ శాఖ ప్రకటించింది.
సాయంత్రం దాకా రె స్క్యూ ఆపరేషన్
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద భూగర్భ జల విద్యుత్ కేంద్రం ఉంది. దీనికెపా సిటీ 900 మెగావాట్లు. గురువారం రాత్రి 10.30 గంటలకు ఈ పవర్ ప్లాంట్ ఫస్ట్ యూనిట్ లోని ప్యానల్లో మంటలు చె లరేగాయి. వాటిని అదుపు చేసేందుకు అక్కడి సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకూ మంటలు తగ్గకపోగా.. ఇతర వస్తువులకు కూడా అంటుకొని భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. తొమ్మిది మంది అందులోనే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత గానీ విషయం బయటకు తెలియలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అర్ధరాత్రి 12.30 నుంచి ఒంటిగంట మధ్య ఫైర్ సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. ఫైర్ టీమ్స్ టెర్మినల్ లోని ప్యానల్ వరకు వెళ్లగలిగినా దట్టమైన పొగల కారణంగా ఏమీ కనిపించక వెనుదిరిగారు. తర్వాత వచ్చిన ఎన్ డీఆర్ఎఫ్ టీమ్ కూ ఇదే పరిస్థితి ఎదురైంది. శుక్రవారం మధ్యాహ్నం సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి . సాయంత్రం 6 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అయినప్పటికీ లోపల చిక్కుకున్న వారిలో ఏ ఒక్కరూ బతకలేదు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్కో, జెన్ కో సీఎండీ ప్రభా కర్ రావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఎస్పీ డాక్టర్సాయి శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల్లో ఐదుగురు ఇంజనీర్లు, ఇద్దరు ప్లాంట్ అటెండెంట్లు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన సిబ్బంది ఉన్నారు.
గురువారం రాత్రి 10:30కు..
శ్రీశైలం ఎడమ గట్టు అండర్ గ్రౌండ్ జల విద్యుత్ కేంద్రంలోని ఫస్ట్ యూనిట్ ప్యానల్ నుంచి ఒక్కసారిగా స్పార్క్ వచ్చింది. వెంటనే అక్కడి ఇంజనీర్లు , ఇతర ఎంప్లాయీస్ అలర్ట్ అయ్యారు. మంటలను ఆర్పేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. కానీ.. మంటలు ఏ మాత్రం అదుపులోకి రాలేదు. అంతకంతకూ ఎగిసిపడ్డాయి.
అర్ధరాత్రి 12 గంటల తర్వాత..
విషయం సీనియర్ ఆఫీసర్లకు తెలిసింది. వాళ్లు వచ్చే సరికే సొరంగం అంతా పొగలు నిండుకున్నాయి. లోపల డ్యూటీలో ఉన్న సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సుమారు కిలోమీటర్ సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. తొమ్మిది మంది లోపలే చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు ప్రారంభించారు.
శుక్రవారం తెల్లవారుజాము నుం చిసాయంత్రం దాక..
సొరంగం నిండా దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం సీఐఎస్ఎఫ్, సింగరేణి టీమ్ లు వచ్చి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. వారికి ఎస్కేప్ ఎగ్జిట్ వద్ద రెండు డెడ్ బాడీలు కనిపించాయి. మరో గంటకు మరో డెడ్ బాడీ.. అటు తర్వాత ఇంకో రెండు డెడ్ బాడీలు.. ఇలా సాయంత్రం 6 గంటల వరకు తొమ్మిది డెడ్ బాడీలను రెస్క్యూ టీమ్ లు బయటకు తీసుకువచ్చాయి. లోపల చిక్కుకున్న ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు.
చివరి వరకు అన్ని ప్రయత్నాలు చేశాం
పవర్ ప్లాంట్ లో చిక్కుకున్న ఏడుగురు జెన్‌కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ కంపెనీ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చివరి వరకు ప్రయత్నించాం. మూడు ఫైర్ ఇంజిన్లు, యంత్రాలతో నీళ్లు చల్లుకుం టూ సహాయక సిబ్బంది మెయిన్ ప్లాంట్‌లోకి వెళ్లగలిగినా అప్పటికే ఆలస్యమైపోయింది. మూడు మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే చాన్స్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ రాత్రి నుంచి కరెంట్ సరఫరా నిలిచి పోయింది. జనరేటర్ ఏర్పాటు చేస్తున్నం. లోపలికి వెళ్లి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలపై ఒక అంచనాకు రాగలం. – ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావు
మృతుల వివరాలు..
- శ్రీనివాస్ గౌడ్, డీఈ, హైదరాబాద్
- వెం కట్‌రావు, ఏఈ పాల్వంచ
- మోహన్ కుమార్, ఏఈ, హైదరాబాద్
- ఉజ్మ ఫాతిమా,ఏఈ, హైదరాబాద్
- సుందర్, ఏఈ, సూర్యాపేట
- రాంబాబు, ప్లాంట్ అటెండెంట్, ఖమ్మం జిల్లా
- కిరణ్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్, పాల్వంచ
- వినేష్ కుమార్,అమరాన్ బ్యాటరీ కంపెనీ స్టాఫ్, హైదరాబాద్
- మహేశ్ కుమార్, అమరాన్ బ్యాటరీ కంపెనీ స్టాఫ్,హైదరాబాద్.