ఆదిలాబాద్ జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో సరదాగా గడుపుదామని విహార యాత్రకు వెళ్లిన వైద్య విద్యార్థులకు అది తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఆదివారం ఆదిలాబాద్ రిమ్స్ కు చెందిన పది మంది వైద్య విద్యార్థులు.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కుంభజేరి కోటి లింగాల వాగు వద్దకు సరదాగా విహారయాత్రకు వెళ్లారు.
వీరిలో ప్రవీణ్ అనే వైద్య విద్యార్థి వాగులో కొట్టుకుపోగా, అతన్ని రక్షించేందుకు ప్రయత్నించి మరొక విద్యార్థి అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో అతడు వాగులో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. గల్లంతైన విద్యార్థి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.