టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలని అఖిలిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మంలో సడక్ బంద్ చేపట్టారు. ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్థన్ తో పాటు సభ్యులను టీఎస్పీఎస్సీ నుంచి తొలగించాలని, నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. కమిషన్ ను సంపూర్ణంగా తొలగించాలని కోరారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాపర్తి నగర్ బైసాస్ పై ధర్నా చేపట్టడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జూం అయింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
ALSO READ: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంట్ గా ఉన్నావ్.. పెళ్లి చూపులు ఇలా కూడానా..!