
నిర్మల్, వెలుగు: ప్రభుత్వ టీచర్లకు సర్వీస్ రూల్స్ పై ఎస్టీయూ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ తెలిపారు. ఆదివారం స్థానిక రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ లో జరిగిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రూల్స్‌పై అవగాహన లోపంతో సర్వీసులో నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ఎస్టీయూ టీచర్లందరికీ అండగా ఉంటుందని, ఎలాంటి నష్టం జరగకుండా చూస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి దక్కాల్సిన అన్ని ప్రయోజనాలను టీచర్లకు దక్కేట్ల చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్, లింగన్న, భూమన్న యాదవ్, లక్ష్మణ్, టీచర్లు పాల్గొన్నారు.