సంబురంగా ముగిసిన సదర్‌‌

సంబురంగా ముగిసిన సదర్‌‌

గ్రేటర్​ సిటీలో సదరు సంబురాలు ఘనంగా ముగిశాయి.  మంగళవారం రాత్రి ముషీరాబాద్, నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో సదర్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డప్పుల దరువులు, కళాకారులు ఆటపాటలతో పాటు దున్నపోతుల  నృత్యాలతో ఆకట్టుకున్నాయి. దున్నపోతుల విన్యాసాలను  చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా చూశారు. ముషీరాబాద్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్​ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,  స్థానిక కార్పొరేటర్ జి.మహాలక్ష్మిగౌడ్, బీఆర్ఎస్ నేతలు రామన్ గౌడ్, పి.కృష్ణయాదవ్  పాల్గొన్నారు.  - వెలుగు, ముషీరాబాద్