హనుమకొండ కలెక్టరేట్, వెలుగు : దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఈ నెల 25 నుంచి స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు హనుమకొండ జిల్లా రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు స్లాట్లు రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులకు మాత్రమే ఆయా తేదీల్లో టెస్ట్‌లు చేయనున్నట్లు తెలిపారు.
కంటిచూపు లేని వారికి ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్‌లో టెస్ట్‌లు నిర్వహిస్తారన్నారు. శారీరక, వినికిడి, మానసిక దివ్యాంగులకు జీఎంహెచ్, ఉర్సు కరీమాబార్ మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో హనుమకొండ బస్టాండ్ పక్కన ఉన్న ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు టెస్ట్‌లు చేయనున్నట్లు తెలిపారు.