ఇవాళ నుంచి సదరం క్యాంప్ స్లాట్ బుకింగ్

ఇవాళ నుంచి సదరం క్యాంప్ స్లాట్ బుకింగ్

వికారాబాద్, వెలుగు:  జిల్లాలోని దివ్యాంగులు సదరం క్యాంపునకు సంబంధించి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ నెల11,13,21, 27, 29 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. 

బుద్ధిమాంద్యత, చెవుడు, మూగ, అంగ వైకల్యం కలిగిన దరఖాస్తుదారులు హాజరుకావాలని సూచించారు.  అదేవిధంగా ఈ నెల 10, 11,18,26 తేదీల్లో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నిర్వహించే క్యాంపులకు అంధులు హాజరు కావాలని తెలిపారు. ప్రస్తుతం 590  స్లాట్స్ అందుబాటులో 
ఉన్నాయన్నారు.