సదాశివపేట బల్దియా బడ్జెట్ రూ.70.03 కోట్లు

సదాశివపేట బల్దియా బడ్జెట్ రూ.70.03 కోట్లు

సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ 2024, -25 బడ్జెట్​సమావేశం గురువారం స్థానిక మున్సిపల్​ఆఫీస్​లోచైర్​పర్సన్​అపర్ణ పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా అడిషనల్​కలెక్టర్​చంద్రశేఖర్​ హాజరయ్యారు. 2023 ఏప్రిల్​వరకు రూ.298.89 లక్షలు, 2023,-24 సవరణ అంచనా ఆదాయం రూ. 1208.94 లక్షలు, సవరణ సాధారణ ఖర్చు రూ. 923.03 లక్షలను కౌన్సిలర్లకు చదివి వినిపించారు.

2024,-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్​ మొత్తం అంచనా ఆదాయం  రూ. 7003.70 లక్షలు, మొత్తం అంచనా వ్యయం రూ. 7002.37 లక్షలు. మిగులు బడ్జెట్​ రూ. 287.24 లక్షలుగా బడ్జెట్​రూపకల్పన చేసినట్టు కమిషనర్​ఉమా సభ్యులకు వివరించారు. 2024,-25 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్​ఆదాయం రూ. 1349.61 లక్షలు, వ్యయం రూ. 1062.37 లక్షలు, మిగులు నిల్వ రూ. 287.24 లక్షలుగా సాధారణ ఆదాయం వ్యయాలను సభ్యులకు చూపారు. రూపకల్పన చేసిన బడ్జెట్​కు 22 మంది మెజార్టీ కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు.