హైదరాబాద్,వెలుగు: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం మారిస్విల్లో సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. ట్రయాంగిల్ తెలంగాణ అసోషియేషన్ (టీటీజీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు 7వేల మంది పాల్గొన్నారు. నార్త్ కరోలినాలో ఉంటున్న తెలంగాణ ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. ఆరు గంటలపాటు ప్రత్యేకంగా నిర్వహించిన బతుకమ్మ నృత్య కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.
కార్యక్రమంలో సెనేటర్ జేజే చౌదరి, మారిస్విల్ మేయర్ టీజే కౌలీ, మేయర్ ప్రోటెం సతీశ్ గరిమెల్ల, కౌన్సిల్ సభ్యులు లిజ్ జాన్సన్, స్టీవ్ రావు, కేరీ టౌన్ కౌన్సిల్ మెంబర్ సరికా బన్సాల్ తదితరులు పాల్గొన్నారు. టీటీజీఏ అధ్యక్షుడు మహిపాల్ బిరెడ్డి, ఉపాధ్యక్షురాలు భారతి వెంకన్నగారి, ఈవెంట్ డైరెక్టర్ శశాంక్ ఉండీల, సాంస్కృతిక డైరెక్టర్ పూర్ణ అల్లె, యువత డైరెక్టర్ శ్రీకాంత్ మందగంటి, ఫెసిలిటీ డైరెక్టర్ రఘు యాదవ్, ఫుడ్ డైరెక్టర్ మహేశ్ రెడ్డి, కోశాధికారి రవి ఎం, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ స్వాతి గోలపల్లి, కమ్యూనికేషన్ డైరెక్టర్ మాధవి కజా నాయకత్వంలో ఈ వేడుకలను సక్సెస్ఫుల్గా నిర్వహించారు.