వేములవాడ, వెలుగు : వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. మూలవాగు వద్ద సాయంత్రం 6 గంటలకు మొదలైన బతుకమ్మ నిమజ్జనం వేడుకలు రాత్రి 11 గంటలకు వరకు కొనసాగాయి. మహిళలు బతుకమ్మ, దాండియా ఆటలు ఆడుతూ సందడి చేశారు. రాజన్న ఆలయంలో మహిళలు కోలాటమాడుతూ ఎంజాయ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగితే ఒక వేములవాడ పట్టణంలో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
వేములవాడలోని మహిళలు అటు పుట్టినింట్లో..మెట్టినింట్లో రెండు చోట్ల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉత్సవాల్లో మున్సిపల్చైర్పర్సన్ మాధవి, జడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, బీజేపీ లీడర్ తుల ఉమ పాల్గొన్నారు. కొత్తపల్లి, గోదావరిఖనిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.