అక్టోబర్ 10న ట్యాంక్​బండ్ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

అక్టోబర్ 10న  ట్యాంక్​బండ్ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు
  • సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు.. ట్రాఫిక్ ​డైవర్షన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం ట్యాంక్​బండ్​పై సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్​బండ్​అమరవీరుల స్థూపం నుంచి లోయర్​ట్యాంక్​బండ్​లోని రోటరీ చిల్ర్డన్స్​పార్కు వరకు సంబురాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హుస్సేన్​సాగర్​పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్​ఆంక్షలు విధించారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్​ను డైవర్ట్​చేయనున్నారు.

బతుకమ్మ ఆడేందుకు వచ్చేవారి వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ మార్గ్‌‌లోని రేస్‌‌ కోర్స్‌‌ రోడ్‌‌, జీహెచ్‌‌ఎంసీ హెడ్డాఫీస్, బీఆర్‌‌‌‌కే భవన్ మధ్య ఉన్న రోడ్‌‌, లోయర్ ట్యాంక్ బండ్‌‌ ప్రాంతాల్లో పార్కింగ్​కేటాయించారు. సికింద్రాబాద్‌‌ నుంచి ట్యాంక్‌‌ బండ్‌‌ మీదుగా ఎంజీబీఎస్‌‌ వెళ్లే జిల్లాల బస్సులు స్వీకార్‌‌‌‌ ఉప్‌‌కార్‌‌‌‌ జంక్షన్‌‌ నుంచి వైఎంసీఏ-, సంగీత్‌‌, -మెట్టుగూడ, -తార్నాక, -నల్లకుంట, ఫీవర్ హాస్పిటల్‌‌, క్రాస్ రోడ్స్, బర్కత్‌‌పురా, టూరిస్ట్‌‌ హోటల్, -నింబోలి అడ్డా, చాదర్​ఘాట్‌‌, రంగమహల్‌‌ మీదుగా వెళ్తాయి. సిటీ బస్సులకు ట్యాంక్‌‌బండ్‌‌ పైకి అనుమతి లేదు. కర్బాల మైదాన్​నుంచి బైబిల్​హౌజ్‌‌ మీదుగా మళ్లిస్తారు.

డైవర్షన్స్​ ఉండే రూట్లు.. 

  • ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్​ ట్యాంక్‌‌ బండ్‌‌ వైపు వచ్చే ట్రాఫిక్​ను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా డైవర్ట్ చేస్తారు. 

  • వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి ఎన్‌‌టీఆర్‌‌ మార్గ్‌‌ వైపు వచ్చే వాహనాలను ప్రసాద్ ఐ మ్యాక్స్‌‌, మింట్ కంపౌడ్‌‌  మీదుగా మళ్లిస్తారు. 
  • రాణిగంజ్‌‌ నుంచి నెక్లెస్‌‌ రోడ్స్‌‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. అటుగా వచ్చే వాహనాలను నల్లగుట్ట క్రాస్ రోడ్స్‌‌ నుంచి మినిస్టర్ రోడ్‌‌ మీదుగా డైవర్ట్‌‌ చేస్తారు. 
  • మినిస్టర్ రోడ్స్‌‌ నుంచి పీవీఎన్‌‌ఆర్‌‌‌‌మార్గ్‌‌ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్ రోడ్స్‌‌ మీదుగా రాణిగంజ్‌‌ వైపు మళ్లిస్తారు. 
  • లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌‌ బండ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్‌‌ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్‌‌‌‌ వైపు డైవర్ట్‌‌ చేస్తారు. 
  • సికింద్రాబాద్‌‌ నుంచి ట్యాంక్‌‌బండ్‌‌ వైపు వచ్చే ట్రాఫిక్‌‌ను కర్బాల మైదాన్‌‌ వద్ద బైబిల్ హౌజ్‌‌ వైపు మళ్లిస్తారు. 
  • దోబీ ఘాట్‌‌ నుంచి చిల్డ్రన్స్‌‌ పార్క్‌‌/అప్పర్ ట్యాంక్‌‌బండ్‌‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. డీబీఆర్ మిల్స్‌‌ వద్ద కవాడిగూడ క్రాస్‌‌ రోడ్స్‌‌ వైపు డైవర్ట్‌‌ చేస్తారు. 
  • సీజీఓ టవర్స్‌‌ నుంచి సెయిలింగ్​క్లబ్‌‌ వైపు వచ్చే ట్రాఫిక్‌‌ను కవాడిగూడ క్రాస్‌‌ రోడ్స్‌‌ వద్ద డీబీఆర్‌‌‌‌ మిల్స్‌‌, జబ్బర్ కాంప్లెక్స్‌‌ వైపు మళ్లిస్తారు.