
కంది, తూప్రాన్, శివ్వంపేట, మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలం పసల్వాది గ్రామంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఎంపీడీవో కార్యాలయం వద్ద డీజే పాటల మధ్య మహిళలు బతుకమ్మ ఆడారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సొంత ఊరైన గోమారంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. చిలప్ చెడ్ మండలంలోని అంతారం, జగ్గంపేట, చండూర్, రాందాస్ పల్లి గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.