ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పువ్వులతో అందంగా పేర్చిన బతుకమ్మల వద్ద మహిళలు ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో పల్లెలు హోరెత్తాయి. బాన్సువాడ నియోజకవర్గం దేశాయ్‌పేట్, పోచారం గ్రామాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మహిళలతో కలిసి సరదాగా బతుకమ్మ ఆడారు. బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీలో 16 అడుగుల బతుకమ్మ ఆకట్టుకుంది.
నెట్వర్క్,వెలుగు