ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. బతుకమ్మ చివరి రోజు కావడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అన్న తేడా లేకుండా ఒక్కదగ్గరికి చేరుకొని ఆడిపాడారు. గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలతో పుడమి పూదోటలను తలపించింది. లీడర్లు వేడుకల్లో పాల్గొన్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఆడబిడ్డల చప్పట్లు, కోలాటాలతో ఊరూవాడలు కోలాహాలంగా మారాయి. సద్దులు ఇచ్చి, పుచ్చుకుంటూ, ఆట పాటలతో బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు.
వెలుగు, నెట్వర్క్