ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు సంబురంగా నిర్వహించారు. రంగుల రంగుల పూలతో తయారుచేసిన బతుకమ్మల వద్ద ఆడిపాడారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడి గౌరమ్మకు వీడ్కోలు పలికారు. కరీంనగర్‌లో టవర్‌సర్కిల్, గంజ్, గణేశ్‌నగర్, రాంనగర్ సత్యనారాయణ టెంపుల్. భగత్‌నగర్.. తదితర ఏరియాల్లో బతుకమ్మలతో ఆడిపాడారు.
సిరిసిల్ల జిల్లాకేంద్రంలో బతుకమ్మ ఘాటు వద్ద వేలాది మంది మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం మానేరు వాగులో నిమజ్జనం చేశారు. సద్దుల బతుకమ్మ బయలుదేరే ముందు ఉమ్మడి జిల్లాలో వర్షం అంతరాయం కలిగించింది. కరీంనగర్, సైదాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కవర్లు, గొడుగులు కప్పుతూ బతుకమ్మ ఆడారు.
-నెట్‌వర్క్, వెలుగు