వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేములవాడ మూలవాగు వద్దకు వేలాది మంది మహిళలు బతుకమ్మలతో చేరుకొని ఆడిపాడారు. అనంతరం బతుకమ్మ తెప్పలో నిమజ్జనం చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 9 రోజులకు సద్దుల బతుకమ్మ జరుపుకుంటుండగా.. వేములవాడలో మాత్రం 7 రోజులకే నిర్వహిస్తారు. సప్తమాతృకల ఆధారంగా అమ్మవారిని 7 రూపాల్లో కొలుస్తారని అందుకే ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నట్లు వేద పండితులు తెలిపారు.
ఉత్సవాల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి లక్ష్మీనరసింహరావు, కాంగ్రెస్ లీడర్లు పుల్కం రాజు, కొక్కుల బాలకృష్ణ, జడల శ్రీనివాస్, కాశ శ్రీనివాస్. చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పాల్గొన్నారు.