
సిద్దిపేట , వెలుగు: జిల్లాలోని పలు గ్రామాల్లో ఏడో రోజునే సద్దుల బతుకమ్మ నిర్వహించారు. అమావాస్య నుంచి ప్రారంభమైన సంబరాలు ఏడో రోజుతో ముగించారు. చిన్నకోడూరు, మాచాపూర్, అల్లీపూర్, మెట్‌పల్లి, కస్తూరిపల్లి, మందపల్లి, నంగునూరు, మిరుదొడ్డి, సిద్దిపేట, కొండపాక మండలాల్లో శుక్రవారం సద్దుల బతుకమ్మ ఘనంగా జరుపుకున్నారు.