SL vs AFG: వికెట్ కీపర్ లెగ్ స్లిప్ క్యాచ్.. షాక్‌లో క్రికెట్ ప్రపంచం

SL vs AFG: వికెట్ కీపర్ లెగ్ స్లిప్ క్యాచ్.. షాక్‌లో క్రికెట్ ప్రపంచం

క్రికెట్ లో ఎన్నో గొప్ప క్యాచ్ లు మనం చూసే ఉంటాం. పక్షిలా విన్యాసాలు, రన్నింగ్, డైవింగ్ క్యాచ్ లంటూ ఇప్పటివరకు ఎన్నో గ్రేట్ క్యాచ్ లు అభిమానులను థ్రిల్ కు గురి చేశాయి. అయితే కొన్ని క్యాచ్ లకు మాత్రం  ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. క్యాచ్ వస్తుందని అప్రమత్తంగా ఉంటూ రెప్ప పాటులో అందుకొని అద్భుతాలు సృష్టిస్తారు. తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి శ్రీలంక వికెట్ కీపర్ సధీర విక్రమే పట్టిన క్యాచ్ ఒకటి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

ఆఫ్ఘనిస్తాన్ తో తొలి టెస్ట్ లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. 46 ఓవర్ తొలి బంతికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ రహ్మత్ షా వెనుక వైపు  స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో వికెట్ కీపర్ సధీర.. ముందుగానే గ్రహించి బాల్ ఆపడానికి చాలా దూరం వెళ్ళాడు. రహ్మత్ షా ఆడిన ఈ షాట్ నేరుగా శ్రీలంక వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. ముందుగానే క్యాచ్ వస్తుందని గ్రహించిన సధీర కీలక వికెట్ తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. సాధారణంగా ఇలాంటి క్యాచ్ లు అందుకోవాలంటే వికెట్ల వెనుక ఎంతో చురుగ్గా ఉండాలి.

ఒక లెగ్ స్లిప్ లో, షార్ట్ లెగ్ లో ఫీల్డర్ పట్టాల్సిన  క్యాచ్ ను వికెట్ కీపర్ అందుకున్నాడు. సధీర చూపిన తెలివికి క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీలంక వికెట్ కీపర్ అద్భుతమైన క్యాచ్ కు రహ్మత్ షా 91 పరుగుల వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఏకైక టెస్ట్ లో శ్రీలంక 1-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ప్రభాత్ జయసూరియాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.