న్యూఢిల్లీ: సంపద సృష్టించి, ఉద్యోగాలు కల్పించే వారిపై రాజకీయ మిమర్శలు కరెక్ట్ కాదని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. భారతీయ వ్యాపారం అభివృద్ధి చెందడం అందరికీ ముఖ్యమన్నారు. అదానీ సమస్యపై పార్లమెంటులో కాంగ్రెస్ పదే పదే నిరసన వ్యక్తం చేయడం, సభ వాయిదా పడడంపై ఆయన గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
భారతదేశం ప్రపంచానికి ప్రజాస్వామ్య వెలుగుగా ఉండాలని ఆకాంక్షిస్తున్న సమయంలో.. పార్లమెంట్‌సమావేశాల్లో అంతరాయం ఏర్పడడం నిరుత్సాహపరుస్తోందని పేర్కొన్నారు. ఏవైనా వైరుధ్యాలు ఉంటే.. అవి చట్టాల పరిధిలోనే ఉండాలన్నారు. కానీ, భవ్య భారత్‌గా మారాలంటే.. భారత వ్యాపారాలు అభివృద్ధి చెందడం అత్యంత ముఖ్యమని జగ్గీ వాసుదేవ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.