ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ 100రోజుల పాటు మోటర్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. యూకేలోని లండన్ నగరం నుంచి భారత్ కు బైక్ రైడ్ చేపట్టనున్నారు. ఒంటరిగానే ఆయన ఈ యాత్రను చేయనున్నారు. శివరాత్రి రోజున ఈశా ఫౌండషన్ లో జరిగిన మహోత్సవంలో వాసుదేవ్ ఈ విషయాన్ని తెలిపారు. నేలతల్లి కోసం ఖండాంతర మోటారు సైకిల్ యాత్ర చేయున్నానని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయటానికే ఈ బైక్ యాత్ర అని చెప్పారు.ఈ నెల 21న లండన్ నుంచి భారత్ వరకు 100 రోజుల పాటు బైక్ పై తాను ఒక్కడినే యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.
తన ఈ మోటార్ సైకిల్ యాత్రలో భాగంగా పర్యటించిన ప్రతి దేశంలో నేల భూసారాన్ని పరిరక్షించేందుకు విధానపరమైన చర్యలు తీసుకోవాలంటూ అక్కడి పాలకులను కోరతామని సద్గురు తెలిపారు. 100 రోజుల యాత్రలో భాగంగా 27 దేశాల పరిధిలో 30,000 కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేయనున్నారు.
ఈ 100 రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రతి రోజు కనీసం 5-10 నిమిషాల పాటు నేల గురించి మాట్లాడాలని అన్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్ . ఇది ఎంతో ముఖ్యమైనదని.. చాలా అవసరమైనదని చెప్పారు. ప్రపంచం మొత్తం 100 రోజుల పాటు భూమి గురించి మాట్లాడాలని కోరారు. శాస్త్రవేత్తలతో పాటు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు మరో 55 ఏళ్లపాటుమాత్రమే సాగు చేసుకోవడానికి అనుకూలంగా భూమి ఉంటుందని చెబుతున్నాయన్నారు. ఆహార కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.. కాబట్టి భూసారం గురించి ఆహార భద్రత గురించి ఆహారోత్పత్తి గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించాలని సద్గురు సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
Beyond race, religion, gender, geography, Soil is the unifier. #SaveSoil. Join the Movement. Stand up for that which is the basis of your life. Starting 21 March, for 100 days, let’s Talk Soil, Sing Soil, Breathe Soil, Live Soil. Let Us Make It Happen. -Sg pic.twitter.com/agnKChdvKp
— Sadhguru (@SadhguruJV) March 2, 2022
మరిన్ని వార్తల కోసం..
ధరణితో తప్పని రైతు కష్టాలు