బంగ్లాదేశ్ దేశంలో.. మన ఇస్కాన్ గురువు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్

బంగ్లాదేశ్ దేశంలో.. మన ఇస్కాన్ గురువు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్

బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మిక గురువు కృష్ణదాస్ ప్రభు (చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి) అరెస్టుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణదాస్ ప్రభు అరెస్టు ను తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. 

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలపై శాంతియుత నిరసనలు తెలుపుతున్న ఆధ్యాత్మిక గురువు కృష్ణదాస్ ప్రభువును సోమవారం ( నవంబర్ 25)న  బంగ్లాదేశ్ డిటెక్టివ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కృష్ణదాస్ ప్రభువుకు బెయిల్ నిరాకరించింది అక్కడి ప్రభుత్వం. కృష్ణ దాస్ ప్రభువు అరెస్ట్, బెయిల్ నిరాకరణపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ALSO READ | ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలే: రాహుల్ గాంధీ

బంగ్లాదేశ్ లో హిందువుల భద్రతపై వెంటనే వివరణ ఇవ్వాలని అధికారులను కోరింది. శాంతియుతంగా తమ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకునే హక్కు ను కాలరాస్తు్న్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. 

బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనార్టీలపై దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇండ్లు, దుకాణాలు దహనం చేయడం,  దొంగతనం, విధ్వంసం, దేవతలను అవమానించడం వంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి.. వీటిపై బంగ్లా ప్రభుత్వం స్పష్ట త ఇవ్వాలని ఎంఈఏ కోరింది.

మరోవైపు కృష్ణదాస్ ప్రభు విడుదల కోసం అక్కడి ఇస్కాన్ సంస్థ సభ్యులు ఆందోళనకు దిగారు. కృష్ణదాస్ ప్రభును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులు జరగడం మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.