మీ Aadhaar card పోగొట్టుకున్నారా..లేదా దొంగిలించబడిందా..మీ ఆధార్ కార్డు మిస్ యూజ్ అవుతుందేమోనని భయపడుతున్నారా.. ఏం ఆందోళన చెందకండి.. ఇప్పుడు UDAI వెబ్ సైట్ ఆధార్ సెక్యూరిటీకోసం ఆధార్ లాక్ అందుబాటులోకి వచ్చింది. మీరు మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా అది పనిచేయకుండా సెక్యూరిటీ లాక్ పెట్టుకోవచ్చు. దీని ద్వారా ఆధార్ కార్డును ఇతరులు ఎవరూ అనధికారికంగా ఉపయోగించకుండా అడ్డుకోవచ్చు. తిరిగి మీ ఆధార్ కార్డును పొందిన తర్వాత అన్ లాక్ చేసుకోవచ్చు. UDAI వెబ్ సైట్ ద్వారా గానీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా గానీ అన్ లాక్ చేసుకోవచ్చు.
Aadhaar card ను ఎలా లాక్ చేయొచ్చంటే..
UIDAI website https://uidai.gov.in/ లోకి వెళ్లి My Aadhaar ను నొక్కాలి.
తర్వాత Aadhaar Lock/ Unlock ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Lock UID ని క్లిక్ చేసి ఆధార్ కార్డు నంబరు, మీ పూర్తి పేరు, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.
మీ రిజిస్టరు మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది.. దానిని ఎంటర్ చేయాలి.
SMS లద్వారా కూడా దశల వారీగా ఆధార్ కార్డును లాక్ చేయొచ్చు..
1947 కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి GET OTP అని రిక్వెస్ట్ ఎస్ ఎం ఎస్ చేయాలి.
1947 కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి LOCKUID OTP అని లాకింగ్ రిక్వెస్ట్ ను పంపాలి.
మీ ఆధార్ కార్డు లాక్ అయిన తర్వాత కన్ ఫర్ మేషన్ మేసేజ్ మీ రిజిస్టర్డు మొబైల్ కు వస్తుంది.
అన్ లాక్ ఎలా చేయాలంటే..
UIDAI website https://uidai.gov.in/ లోకి వెళ్లి My Aadhaar ను నొక్కాలి.
Unlock UIDను సెలక్ట్ చేసుకొని 16 అంకెల Virtual ID నంబర్ ను ఎంటర్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ కు OTP వస్తుంది దానిని ఎంటర్ చేసి కన్ ఫర్మ్ చేసుకోవచ్చు.
SMS ద్వారా ఆధార్ కార్డును అన్ లాక్ చేయాలంటే..
1947 కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి GET OTP అని రిక్వెస్ట్ ఎస్ ఎం ఎస్ చేయాలి.
1947 కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి UNLOCKUID OTP అని లాకింగ్ రిక్వెస్ట్ ను పంపాలి.
మీ ఆధార్ కార్డు అన్ లాక్ అయిన తర్వాత కన్ ఫర్ మేషన్ మేసేజ్ మీ రిజిస్టర్డు మొబైల్ కు వస్తుంది.
ALSO READ: ఐకియాకు రూ.3 వేల ఫైన్.. 20 రూపాయల దగ్గర కక్కుర్తి