
థింపు (భూటాన్): శాఫ్ అండర్ 17 చాంపియన్‌షిప్‌లో ఇండియా మెన్స్ ఫుట్‌బాల్ టీమ్ ఫైనల్ చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 4–2తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. ఫస్టాఫ్‌లో ఖాతా తెరవలేకపోయిన ఇండియాకు విశాల్ యాదవ్ 61, 68వ నిమిషాల్లో వెంటవెంటనే రెండు గోల్స్ అందించాడు.
రిషి సింగ్ (85వ ని), లుంకిమ్ (90+5వ ని) చెరో గోల్ చేశారు. ఇండియా ప్లేయర్ సుభాష్ బామ్ (81 వ ని) సెల్ఫ్ గోల్ చేయడంతో ప్రత్యర్థి ఖాతా తెరించింది. ఆపై, నేపాల్ ఆటగాడు మొహమ్మద్ కైఫ్ (89వ ని) ఓ గోల్ కొట్టాడు. రెండో సెమీస్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య విన్నర్‌తో ఇండియా సోమవారం ఫైనల్లో
తలపడనుంది.