ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.... ప్రస్తుత నీటి మట్టం 885లకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 215 టీఎంసీలుగా ఉంది.
మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కూడా వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌లోకి లక్షా 32 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ 311 టీఎంసీలుగా నమోదు అయ్యింది.