సాగర్ ఎడమ కాల్వకు గండి.. తీవ్ర భయాందోళనలో ప్రజలు

సూర్యపేట: రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నదులు, కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే సూర్యపేట జిల్లాలో ప్రవహించే సాగర్ ఎడమ కాల్వకు గండి పడింది. వరద ఉధృతి ఎక్కువై నడిగూడెం మండలంలోని రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు గండిపడింది. దీంతో వరద నీరు పంటపొలాల ద్వారా మెల్లగా గ్రామంలోకి చేరుకుంటుంది.

కాల్వకు గండి పడి వరద నీరు రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. గండి పడే అవకాశం ఉందని గతంలో అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గండి పూడ్చివేత అధికారులు ఛాలెజింగ్ మారింది. ఏ క్షణాన ఏం జరుగుతోందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.   

Also Read :- శ్రీశైలం ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండచరియలు రాకపోకలు బంద్