12 గేట్ల నుంచి సాగర్ నీటి విడుదల

12 గేట్ల నుంచి సాగర్ నీటి విడుదల

హాలియా, వెలుగు: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు12 గేట్లను ఎత్తి 95,064 క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి 1,37,871  క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, జలాశయం నుంచి అంతే మొత్తంలో నీటిని కిందికి పంపిస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం6  గంటల వరకు సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312 టీఎంసీ)లకు 588. 30 అడుగులుగా నమోదైంది. 

ప్రాజెక్ట్ కుడి కాల్వ ద్వారా 8,529, ఎడమ కాల్వ ద్వారా 2,210, విద్యుత్​ఉత్పత్తికి 29, 800, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800, వరద కాల్వకు 600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.