
- మూల 1, 2, 3, 4 పాదములు; పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు; ఉత్తరాషాఢ 1వ పాదము. మీ పేరులో మొదటి అక్షరం యే, యో, బా, బి, భూ, ధా, భ, ధా, బే
- ఆదాయం: 5
- రాజపూజ్యం : 1
- వ్యయం: 5
- అవమానం : 5
గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు తామ్రమూర్తిగాను తదుపరి 18.10.2025 వరకు లోహమూర్తిగాను తదుపరి 05.12.2025 వరకు రజితమూర్తిగాను ఉగాది వరకు సంచారము.
శని: ఉగాది నుండి మరల ఉగాది వరకు నాలుగో స్థానంలో లోహమూర్తిగా సంచారము.
రాహువు: 3వ స్థానంలో, కేతువు: 10వ ఇంట సువర్ణమూర్తిగా ఉగాది నుండి ఉగాది వరకు సంచారము.
ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఆదాయ వ్యయములు ఖర్చు ఆదాయం సమానంగా ఉండగలదు. రైతు సోదరులకు పంటలు దిగుబడిగా ఉండగలవు. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు కొంతవరకు అదనపు వనరులు ఉండవు కాని ఒక డాక్టర్లు, లాయర్లు అధిక వనరులు కలిగి ఉంటారు. కాంట్రాక్టర్లకు కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు అధిక వనరులు కలిగి ఉంటారు. వెండి బంగారం, ఐరన్ సిమెంట్ కంకర వారికి అనుకూలం. టింబర్ వ్యాపారులకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఫ్యాన్సీ కిరాణ వస్త్ర వ్యాపారులకు మందులు వ్యాపారులకు కెమికల్స్రంగులు రసాయన వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.
బిగ్ ఇండస్ట్రీ వారికి అనుకూలంగా ఉంటుంది. స్మాల్ ఇండస్ట్రీ వారికి కొంత గాలి పోసుకొనగలరు. పౌల్ట్రీ మత్స్య పరిశ్రమ పాడి పరిశ్రమ కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. చీట్స్ షేర్స్ కొన్ని సమస్యలు ఉన్నవి. విద్యార్థులకు అధిక మార్కులు ధనమునకు కొన్ని విధములుగా బ్రేకులు వేయగలరు. డబ్బు మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు అగుటకు అవకాశములు ఉన్నవి. జాయింట్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా మాట్లాడుకొనగలరు. చేతి పనివారికి చాలా సామాన్యంగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులు కొన్ని విధములుగా ముందుకు సాగండి.
అతిగా ఆలోచనలు చేయరాదు. జ్ఞాపకశక్తి తగ్గకుండా చూసుకొనగలరు. జనాకర్షణ ధనాకర్షణ కోసం పాటుపడగలరు. ఇన్ని సమస్యలు ఉన్నను గడిచిపోతుంది. ప్రభుత్వ రాయితీలు పొందగలరు. సినిమావారు కొంతశాతం అభివృద్ధి ఉన్నది. టీవీ ఆర్టిస్టులకు గతం కన్నా ఆదాయవనరులు పొందగలరు. మీరు వాక్చాతుర్యంతో రాణించగలరు. మీరు ఆదాయ వ్యయముల విషయంలో మీ అవసరములకు డబ్బు అందుతుంది. నిర్లక్ష్యం పనికి రాదు. చాలా యాక్టివ్‌గా పాజిటివ్‌గా ఉండండి. నెగిటివ్‌గా మాట్లాడరాదు.
స్నేహితుల విషయంలో తొందరపడి మాట్లాడి ఇతరుల మనసును గాయం చేయరాదు. ముక్కు సూటి మాటలు వద్దు. రిలేషన్ పెరిగి ప్రేమగా అభిమానంగా ఇష్టంగా మాట్లాడి అందరి మన్ననలు పొందండి. మీరు ఈ విషయంలో ముందుకు దూసుకొని వెళ్ళగలరు. మూల నక్షత్రం వారు వైఢూర్యం ధరించి చిత్రగుప్తుని దేవాలయ పూజలు వినాయక సరస్వతిదేవి పూజలు చేయండి. పూర్వాషాఢ నక్షత్రం వారు వజ్రం ధరించండి. గజలక్ష్మి దేవి అష్టోత్తరం సహస్ర నామములు చేయండి.
లక్ష్మీ కవచం పారాయణ కనకధార స్తోత్ర పారాయణం ఆర్థికలోటు లేదు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు జాతి కెంపు ధరించండి. ఆదిత్య హృదయ పారాయణం సూర్య అష్టోత్తరం సూర్య దండకం పారాయణ చేయండి. నవగ్రహ జప దానాలు ప్రదక్షిణలు చేయుట వలన ఏ విధమైన సమస్యలు దగ్గరకు రావు. మహన్యాస రుద్రాభిషేకం యోగ ధ్యానం ఆక్యుప్రెషర్ ఆరోగ్యం కొరకు పాటించండి. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణలు చేయించి వారి ఆశీస్సులు పొందండి. విశ్వాసంతో ముందుకు సాగండి. అదృష్టసంఖ్య 3.