హైదరాబాద్, వెలుగు: సహజ్ మార్గ్ స్పిరిచ్వాలిటీ ఫౌండేషన్ హాస్పిటల్‌కు ఎల్‌ఐసీ మంగళవారం ఒక అంబులెన్స్‌ను దానం చేసింది. కంపెనీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్‌కు బదులు ఎల్‌ఐసీ జోనల్ మేనేజర్ (హైదరాబాద్) పునీత్ కుమారు ఈ హాస్పిటల్ ఇన్‌ఛార్జ్ కిషోర్ సబ్బుకు అంబులెన్స్‌ను అందించారు. హైదరాబాద్‌కు ఔట్‌స్కర్ట్స్‌లోని కొత్తూర్ మండలం చేగూర్ విలేజ్ ఏరియాలో ఈ 20 బెడ్ల హాస్పిటల్ ఉంది.
అర్హులకు ఫ్రీగా వైద్యాన్ని అందిస్తోంది. నెలలో 8 నుంచి 10 సార్లు రోగులను వేరే హాస్పిటల్‌కు షిప్ట్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు అంబులెన్స్ అవసరమని, ఈ అవసరాన్ని ఎల్‌ఐసీ తీర్చిందని కిషోర్ అన్నారు. ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్‌కు రూ.1,000 కోట్ల ఫండ్ ఉందని, సంస్థ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అన్నారు. సమాజ సేవకు ఈ డబ్బులు ఖర్చుచేస్తోందన్నారు.